ఉచిత సాధనాలు

ఉచిత గోప్యతా విధాన జనరేటర్

మీ వెబ్‌సైట్ కోసం గోప్యతా విధానం టెంప్లేట్

కస్టమ్ గోప్యతా విధానం Shopifyతో పాటే వస్తుందని మీకు తెలుసా? యూజర్‌లు దీన్ని రివ్యూ చేయడానికి, తమ వెబ్‌సైట్‌లకు జోడించడానికి ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

మీరు Shopifyని ఉపయోగించకపోయినా పర్వాలేదు. కింద ఉన్న మా ఉచిత గోప్యతా విధాన జనరేటర్‌ మీ వ్యాపారానికి ఎంతో సహాయపడుతుంది. కింది వివరాలను పూరిస్తే, మీ వ్యాపారానికి తగిన వ్యక్తిగతీకరించిన వెబ్‌సైట్ గోప్యతా విధాన టెంప్లేట్‌ను మేము ఇమెయిల్ చేస్తాము. మీ స్టోర్‌ఫ్రంట్ కాన్ఫిగరేషన్, వ్యాపార పద్ధతులకు అనుగుణంగా మీరు అనుకూలీకరించుకునే ప్రాథమిక అంశాలు ఇందులో ఉంటాయి.

మీ గోప్యతా విధానంతో పాటుగా Shopify ఉచిత ట్రయల్‌ను పొందండి

మీ కంపెనీ సమాచారాన్ని నమోదు చేయండి

2 దశలలో 1వ దశ

మీ ఇమెయిల్‌ను నమోదు చేయడం ద్వారా, Shopify నుండి మార్కెటింగ్ ఇమెయిల్‌లను పొందడానికి మీరు అంగీకరిస్తున్నారు.

మీ వెబ్‌సైట్ సమాచారాన్ని నమోదు చేయండి

2 దశలలో 2వ దశ

మా గోప్యతా విధాన టెంప్లేట్ న్యాయ సలహా కాదు మరియు దీన్ని ఉపయోగించడం ద్వారా మీరు  

అంగీకరిస్తారు.

రీఫండ్ విధానం

కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనండి, వారి డబ్బుకు తగిన విలువ లభిస్తుందనే భరోసాను వాళ్లకు కల్పించండి.

రీఫండ్ విధానాన్ని పొందండి

సేవా నిబంధనల విధానం

మీ సైట్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఏమేం చేయవచ్చు, ఏమేం చేయకూడదనే విషయాలను మీ సందర్శకులకు తెలియజేస్తుంది.

సేవా నిబంధనల విధానాన్ని పొందండి

తరచుగా అడిగే ప్రశ్నలు

గోప్యతా విధానం అనేది ఒక చట్టపరమైన పత్రం. ఏదైనా వ్యాపారం కస్టమర్‌ల డేటాను ఎలా సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది, ఇతరులతో పంచుకుంటుంది, మరియు ఎలా నిర్వహిస్తుందనే వివరాలు ఇందులో ఉంటాయి. మీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఏయే రకాల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంది, దాన్ని ఎలా ఉపయోగిస్తారు మరియు పంచుకుంటారు, దానికి ఎలాంటి భద్రత ఉంటుంది, అలాగే తమ సమాచారంపై ఆయా వ్యక్తులకు ఎలాంటి హక్కులు ఉంటాయనే విషయాలను వెబ్‌సైట్ సందర్శకులకు, కస్టమర్‌లకు తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం.

పాలసీ జనరేటర్ అనేది వ్యాపారాలకు Shopify అందించే ఉచిత సాధనం. అంటే దీన్ని ఉపయోగించడానికి ఎటువంటి ఖర్చు ఉండదు. మేము ప్రస్తుతం కింది పాలసీ జనరేటర్‌లను అందిస్తున్నాము:

మీరు మీ వెబ్‌సైట్ సందర్శకుల నుండి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే, మీరు చట్టప్రకారం మీ వెబ్‌సైట్‌లో (మీకు యాప్ ఉంటే, మీ మొబైల్ యాప్‌లో కూడా) గోప్యతా విధానాన్ని ఉంచాల్సి రావచ్చు.

చట్టపరమైన నిబంధనలే కాకుండా, స్పష్టమైన, తాజా వివరాలతో కూడిన, సులభంగా అందుబాటులో ఉండే గోప్యతా విధానం అనేది మీకూ, మీ కస్టమర్‌లకూ మరియు వెబ్‌సైట్ సందర్శకులకూ మధ్య నమ్మకాన్ని, పారదర్శకతను పెంచడంలో చాలా కీలకంగా పనిచేస్తుంది.

Shopify ఉచిత గోప్యతా విధాన జనరేటర్ సాధనాన్ని ఉపయోగించడం చాలా సులభం. దీన్ని ఎలా ప్రారంభించాలంటే:

  1. మీ ఇమెయిల్, కంపెనీ సమాచారాన్ని నమోదు చేయండి
  2. మీ ఇన్‌బాక్స్‌కు మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గోప్యతా విధానం వచ్చే వరకు వేచి ఉండండి
  3. మీరు వ్యక్తిగత సమాచారాన్ని ఎలా నిర్వహిస్తారనే దాన్ని బట్టి, మీ పాలసీ కంటెంట్‌ను సమీక్షించి, అనుకూలీకరించండి