ఉచిత టూల్స్
ఉచిత వాపసు విధాన జనరేటర్
మీ వెబ్‌సైట్ కోసం రీఫండ్ విధాన టెంప్లేట్
ఒక మంచి రీఫండ్ లేదా వాపసు విధానం మీ కంపెనీని రక్షించడంలో, అలాగే మీ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో సహాయపడుతుంది, అయితే మీ విధానం స్పష్టంగా, సంక్షిప్తంగా ఉండటం చాలా ముఖ్యం. తక్షణమే వాడుకోదగిన ప్రొఫెషనల్ రీఫండ్ లేదా వాపసు విధానాన్ని సులభంగా రూపొందించుకోవడానికి మా వాపసు విధాన టెంప్లేట్ మీకు సహాయపడుతుంది.
దిగువ ఉన్న రీఫండ్ విధాన జనరేటర్‌లో మీ వివరాలను నమోదు చేయండి, మేము మీ కంపెనీకి సరిపోయే అనుకూలమైన ఉచిత విధానాన్ని మీకు ఇమెయిల్ చేస్తాము.
మీ రీఫండ్ విధానంతో పాటు Shopify ఉచిత ట్రయల్‌ను పొందండి
ఈ నమూనా టెంప్లేట్‌లు న్యాయ సలహా కావు, వీటిని ఉపయోగించడం ద్వారా మీరు అంగీకరించేది
గోప్యతా విధానం
అనేక దేశాల్లో గోప్యతా విధానాలు చట్టపరంగా తప్పనిసరి చేయబడ్డాయి, కస్టమర్ల నమ్మకాన్ని పెంచుకోవడానికి కూడా ఇవి అద్భుతమైన మార్గం.
సేవా నిబంధనల విధానం
మీ సైట్‌లో షాపింగ్ చేసేటప్పుడు సందర్శకులు ఏమేం చేయవచ్చు, ఏమేం చేయకూడదు అనే విషయాలను ఇది వారికి తెలియజేస్తుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
రీఫండ్ విధానాన్ని వాపసు విధానం అని కూడా అంటారు, ఇది మీరు విక్రయించే ఉత్పత్తుల రీఫండ్‌లు లేదా రిటర్న్‌లను మీ కంపెనీ ఎలా డీల్ చేస్తుందనే దాని గురించి కస్టమర్లకు తెలియజేసే డాక్యుమెంట్. రీఫండ్‌లు లేదా రిటర్న్‌లపై కంపెనీ విధానం పూర్తిగా విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది, అంటే రీఫండ్‌లు లేదా రిటర్న్‌లు అందించడానికి చట్టపరంగా ఎలాంటి బాధ్యతా ఉండదు. అయినప్పటికీ, దాదాపు అన్ని రిటైల్ కంపెనీలు ఏదో ఒక రకమైన రీఫండ్ లేదా రిటర్న్‌ను అందిస్తాయి, ఎందుకంటే ఇది (ఉదాహరణకు ఉత్పత్తి లోపభూయిష్టంగా ఉంటే) పారదర్శకతను సృష్టిస్తుంది, అలాగే విక్రేత, కొనుగోలుదారుల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. మీరు చాలా వరకు కంపెనీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో, కొనుగోలు రసీదుపై రీఫండ్ విధానాన్ని చూడవచ్చు.
గోప్యతా విధానం వలె కాకుండా, చట్టం ప్రకారం రీఫండ్ విధానం ఖచ్చితంగా ఉండాలని ఏమీ లేదు. అయినప్పటికీ, దాదాపు అన్ని రిటైల్ కంపెనీలు ఏదో ఒక రకమైన రీఫండ్ లేదా రిటర్న్‌ను అందిస్తాయి ఎందుకంటే ఇది (ఉదాహరణకు ఉత్పత్తి లోపభూయిష్టంగా ఉంటే) పారదర్శకతను సృష్టిస్తుంది, అలాగే విక్రేత, కొనుగోలుదారుల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. రిటర్న్‌లు, రీఫండ్‌లను అందించడం అనేది వ్యాపారానికి ఒక ఉత్తమ ఆచరణగా పరిగణించబడుతుంది, అలాగే కస్టమర్లు మీ రీఫండ్ విధానం ఆధారంగానే మీ స్టోర్‌లో షాపింగ్ చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటారు.
రీఫండ్ విధానం అనేది సాపేక్షంగా సూటిగా ఉండొచ్చు. దానికి గోప్యతా విధానం లేదా నిబంధనలు మరియు షరతులు లాంటి చట్టపరమైన పత్రం రూపం ఉండాల్సిన అవసరం లేదు. రీఫండ్ విధానం ఈ కింది ప్రశ్నలకు సమాధానమివ్వాలి:
- ఐటెమ్‌ను తిరిగి ఇవ్వడానికి కస్టమర్‌కు ఎంత సమయం ఉంటుంది?
- ఐటెమ్‌లను ఏ స్థితిలో ఉన్నప్పుడు తిరిగి ఇవ్వవచ్చు?
- రీఫండ్ జారీ చేయబడుతుందా? అలా అయితే, ఎంత మొత్తం, ఏ రూపంలో (ఉదాహరణకు స్టోర్ క్రెడిట్ లేదా రీఫండ్) ఇస్తారు?
- మార్పిడులు (ఎక్స్ఛేంజ్‌లు) ఎలా పని చేస్తాయి?
- సేల్‌లో ఉన్న ఐటెమ్‌లకు రిటర్న్‌లు లేదా రీఫండ్‌లను అంగీకరిస్తారా?
- షిప్పింగ్ కోసం ఎవరు చెల్లిస్తారు?
Shopify ఉచిత విధాన జనరేటర్ టూల్‌ను న్యాయ నిపుణులు డెవలప్ చేశారు, అలాగే రివ్యూ చేశారు. ఈ టూల్ ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది, ప్రారంభించడానికి:
- మీ ఇమెయిల్, కంపెనీ సమాచారాన్ని నమోదు చేయండి
- మీకు అనుకూలీకరించిన విధానం మీ ఇన్‌బాక్స్‌కు వచ్చే వరకు వేచి ఉండండి
- అందించిన సూచనల ఆధారంగా మీ విధానాన్ని అనుకూలీకరించుకోండి
విధాన జనరేటర్ అనేది వ్యాపారాల కోసం Shopify అందిస్తున్న ఉచిత టూల్. అంటే దీన్ని ఉపయోగించడానికి ఎలాంటి ఖర్చు ఉండదు. Shopify నుండి ఉపయోగించడానికి అందుబాటులో ఉన్న మరిన్ని ఉచిత విధాన జనరేటర్‌లు ఇక్కడ ఉన్నాయి:
- గోప్యతా విధానం
- రీఫండ్ విధానం
- నిబంధనలు మరియు షరతులు